పక్షిలోని చీమలోని ఐకమత్యం
కనిపించలేదా మనిషికి
ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదని
తెలిసి
తెల్లారిపోయే బ్రతుకు కోసం
ప్రాకులాట ఎందుకు
త్రుప్తి లేని జీవితం నరకమే
అసూయ నిండిన మనసుకు
ఆత్మాభిమానం అనే ముసుగువేసి
మనుషుల మధ్యవిరోధాలు వైషమ్యాలు
సృష్టించి ఏమి సాధించాలని
సుడిగుండాలు ప్రళయాలు సృష్టిస్తే
అందరికి చేటె.